Home » Ayyappa Swamy Telugu songs

Ayyappa Swamy Telugu songs

Ayyappa Devaya Namaha

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

Bhagavaan Saranam Bhagavati Saranam Telugu

భగవాన్ శరణం భగవతి శరణం

శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవానే - భగవతియే
దేవనే - దేవియే
ఈశ్వరనే - ఈశ్వరియే
" భగవాన్ "
నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించేదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమ్మే స్మరియించేదము అయ్యప్ప
" భగవాన్ "
కరిమల వాసా పాప వినాశా శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప
" భగవాన్ "
మహిషి సంహారా మద గజ వాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాసా సుందర రూపా శరణం శరణం అయ్యప్పా
" భగవాన్ "

Saranam Saranamayaa Ayyappa Swami

శరణం శరణమయా స్వామీ

శరణం శరణమయా అయ్యప్పా

శరణం అన్నా మరణం లేదు

శబరి గిరి నిలయా ... " శరణం "

అందరి దేవుడవే స్వామి

ఆదరించు దేవుడవే అయ్యప్పా

అయ్యప్ప దేవుడవే స్వామి

అరణ్య వాసుడవే స్వామి " శరణం "

హరి హర పుత్రుడవే స్వామి

ఆనంద రూపుడవే అయ్యప్పా

మోహిని పుత్రుడవే స్వామి

మోహన రూపుడవే అయ్యప్పా " శరణం "

మహిషి మర్ధనుడా స్వామి

మదగజ వాహనుడా అయ్యప్పా

వనపులి వాహనుడా నీకు

వందనము జేసేదము అయ్యప్పా " శరణం "

గజ ముఖ సోదరుడా స్వామి

షణ్ముఖ సోదరుడా అయ్యప్పా

కారణ జన్ముడవే స్వామి

Harivarasanam Telugu Lyrics KJ Yesudasu Song

హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

హరివరాసనం స్వామి విశ్వమోహనం |
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం ||
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||

||శరణం||

శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

Satyamu Jyotiga Velugunayaa... Ayyappa

సత్యము జ్యోతిగ వెలుగునయా
నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరు రారయ్యా
శబరి గిరికి పోవుదము

శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరీశా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురు స్వామియే శరణం అయ్యప్ప

హరిహర మానస సుతుడైన
సురల మొరలను ఆలించి
భువిలో తాను జనియించి
పడునాల్గేండ్లు వసియించి

ఘోరా తడవిలో బాలునిగా
సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు
పసి బాలునిగా కనిపించి

మనికంట అను
నామముతో
పెంచిరి బాలుని మురిపెముగా
స్వామి మీ మహిమలతో
రాజుకు కలిగెను సుతుడొకడు